CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 27 October 2026, 10:23 pm Posted by : CHAITHANYA GALAM NEWS

రూ.15 కోట్లతో ఓదెల మల్లన్న ఆలయ పునర్నిర్మాణం

  • అభివృద్ధి పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్‌ విజయరమణ రావు

ఓదెల, అక్టోబర్‌ 27 (చైతన్యగళం):

ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు తెలిపారు. ఓదెల మల్లన్న ఆలయంలో రూ.15 కోట్ల వ్యయంతో చేపడుతున్న పునర్నిర్మాణ పనులతోపాటు ఇతర అభివృద్ధి పనులను మంగళవారం ఆయన స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించి, సంబంధిత వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు ఆలయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పనులను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లి ఆలయానికి వచ్చే భక్తులకు అవసరమైన సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, పలువురు సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.