ఐఐటీ బాంబేలో విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

డైరెక్టర్‌ శిరీష్‌ కేదారే రాజీనామా చేయాలి: ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్‌ కరీంనగర్‌, అక్టోబర్‌ 27 (చైతన్యగళం): ముంబైలోని ఐఐటీ బాంబేలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) కరీంనగర్‌ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్‌ డిమాండ్‌ చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారంలో యాజమాన్యం విఫలమైందని ఆరోపిస్తూ, ఐఐటీ బాంబే డైరెక్టర్‌ శిరీష్‌ కేదారే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని కోరారు. సోమవారం కరీంనగర్‌లోని మంకమ్మతోటలో ఉన్న ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యాలయంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో...