వ్యభిచార కార్యకలాపాలపై పోలీసుల దాడులు
ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ సదానందం వెల్లడి హుస్నాబాద్, అక్టోబర్ 27 (చైతన్యగళం): హుస్నాబాద్ పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు సోమవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ వ్యవహారానికి సంబంధించి హుస్నాబాద్‌కు చెందిన ఓ మహిళ, అక్కన్నపేట మండలానికి చెందిన మరో వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ సౌదారపు సదానందం తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించామని, దాడుల సమయంలో 22 ఏళ్ల యువతి అక్కడ ఉన్నట్లు ఏసీపీ...