- ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ సదానందం వెల్లడి
హుస్నాబాద్, అక్టోబర్ 27 (చైతన్యగళం): హుస్నాబాద్ పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు సోమవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ వ్యవహారానికి సంబంధించి హుస్నాబాద్‌కు చెందిన ఓ మహిళ, అక్కన్నపేట మండలానికి చెందిన మరో వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ సౌదారపు సదానందం తెలిపారు.
ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించామని, దాడుల సమయంలో 22 ఏళ్ల యువతి అక్కడ ఉన్నట్లు ఏసీపీ వెల్లడించారు. గతంలోనూ ఈ వ్యవహారంపై ఫిర్యాదులు అందడంతో సంబంధిత వ్యక్తులకు కౌన్సెలింగ్ ఇచ్చామని తెలిపారు. అయినప్పటికీ ఇలాంటి కార్యకలాపాలు కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా, కరీంనగర్ రోడ్డులో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరుతూ మున్సిపల్ అధికారులకు లేఖ రాసినట్లు ఏసీపీ తెలిపారు. ఈ దాడుల్లో సీఐ శ్రీధర్ గౌడ్, ఎస్‌ఐ పాకాల లక్ష్మారెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.