మక్తల్‌లో పోలీసుల కార్డన్‌ సెర్చ్‌.. 43 వాహనాల స్వాధీనం!

నేరాల నియంత్రణే లక్ష్యం.. అనుమానాస్పద వాహనాలపై తనిఖీలు మక్తల్‌, అక్టోబర్‌ 27 (చైతన్యగళం): నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా నారాయణపేట జిల్లా మక్తల్‌ పట్టణంలోని అంబేద్కర్‌ నగర్‌, ఎల్లమ్మకుంట ప్రాంతాల్లో పోలీసులు మంగళవారం ఉదయం కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. జిల్లా ఎస్పీ వినీత్‌ ఆదేశాల మేరకు మక్తల్‌ సీఐ రాంలాల్‌ రాథోడ్‌ ఆధ్వర్యంలో ఐదుగురు ఎస్‌ఐలు సహా మొత్తం 40 మంది పోలీసు సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. తనిఖీల్లో అనుమానాస్పదంగా ఉన్న వాహనాలను పోలీసులు పరిశీలించారు. సరైన ధ్రువపత్రాలు, నంబరు...