అంతరిక్ష విజ్ఞాన పోటీల్లో పాములపాడు విద్యార్థిని ప్రతిభ

ఇస్రో ప్రశంసా పత్రం అందుకున్న దిలీషా పాములపాడు, అక్టోబర్‌ 26 (చైతన్యగళం): నంద్యాల జిల్లా పాములపాడులోని శ్రీ వివేకానంద విద్యా విహార్‌ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న పి. దిలీషా అంతరిక్ష విజ్ఞాన పోటీల్లో ప్రతిభ కనబరిచి ప్రశంసా పత్రం అందుకుంది. సెప్టెంబర్‌ 28న శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల్లో భాగంగా జరిగిన అంతరిక్ష విజ్ఞాన, సాంకేతిక ప్రశ్నావళి పోటీల్లో పాల్గొని మండల స్థాయిలో విజేతగా నిలిచి జిల్లా స్థాయికి ఎంపికైంది.ఈ సందర్భంగా పాఠశాల...