- ఇస్రో ప్రశంసా పత్రం అందుకున్న దిలీషా
పాములపాడు, అక్టోబర్ 26 (చైతన్యగళం): నంద్యాల జిల్లా పాములపాడులోని శ్రీ వివేకానంద విద్యా విహార్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న పి. దిలీషా అంతరిక్ష విజ్ఞాన పోటీల్లో ప్రతిభ కనబరిచి ప్రశంసా పత్రం అందుకుంది. సెప్టెంబర్ 28న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల్లో భాగంగా జరిగిన అంతరిక్ష విజ్ఞాన, సాంకేతిక ప్రశ్నావళి పోటీల్లో పాల్గొని మండల స్థాయిలో విజేతగా నిలిచి జిల్లా స్థాయికి ఎంపికైంది.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఆర్.ఎస్.ఆర్. గోపాల్ విద్యార్థినిని అభినందించారు. చిన్నతనం నుంచే అంతరిక్షం, శాస్త్రసాంకేతిక రంగాలపై ఆసక్తి పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాల డైరెక్టర్ రాయపాటి దేవిక, ఉపాధ్యాయులు బాలకృష్ణమ్మ, షాజహాన్, సురేంద్ర, నారాయణ, సిబ్బంది దిలీషాను అభినందించారు.