CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 27 October 2026, 11:52 am Posted by : CHAITHANYA GALAM NEWS

తుమ్మిడిహెట్టిపై కొత్తగా సాధించిందేమీ లేదు – మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ విమర్శ

కరీంనగర్‌, అక్టోబర్‌ 26 (చైతన్యగళం): తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశంతో కొత్తగా సాధించిందేమీ లేదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ విమర్శించారు. పదేళ్లుగా చర్చిస్తున్న అంశంపైనే మళ్లీ చర్చలు జరిపి, మరో కమిటీ ఏర్పాటు చేయడం సమస్యకు పరిష్కారం కాదన్నారు.గతంలోనూ 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మాణాన్ని మహారాష్ట్ర వ్యతిరేకించిందని, కేసీఆర్‌ హయాంలోనూ ఈ అంశంపై చర్చలు జరిగాయని గుర్తుచేశారు. ప్రస్తుత సమావేశాన్ని గొప్ప విజయంగా చూపించడం సరికాదన్నారు.మహారాష్ట్ర ప్రతిపాదిస్తున్న భారీ ఎత్తిపోతల, నీటి మళ్లింపు పథకాలపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భవిష్యత్తులో గోదావరి నీటి లభ్యతపై వాటి ప్రభావాన్ని అధ్యయనం చేసి, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని వినోద్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.