యాచారం, అక్టోబర్ 27 (చైతన్యగళం): యాచారం మండలానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు భాస్కర్ గుప్తా మాతృమూర్తి ఉప్పల అంజమ్మ మృతి పట్ల ఆదిబట్ల మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్‌రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అంజమ్మ పరమపదించారని తెలిసి విచారం వ్యక్తం చేసిన ఆయన, మంగళవారం భాస్కర్ గుప్తా నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా భాస్కర్ గుప్తాతో పాటు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తమ్మలోనిగూడెం సర్పంచ్ దిండి రామ్‌రెడ్డి, టేకుల కమలాకర్‌రెడ్డి తదితరులు పాల్గొని భాస్కర్ గుప్తా కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.