ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి

తిమ్మాపూర్‌, అక్టోబర్‌ 26 (చైతన్యగళం): తిమ్మాపూర్‌ మండలం రేణికుంట గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆదికవి మహర్షి వాల్మీకి జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ ఎలుక అంజనేయులు వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ రామాయణ మహాకావ్యాన్ని రచించి ధర్మం, సత్యం, న్యాయం, మానవతా విలువలను ప్రపంచానికి చాటిచెప్పిన మహర్షి వాల్మీకి జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన ఆశయాలను ఆచరిస్తూ సమాజంలో సమానత్వం, సోదరభావం, సేవాభావాన్ని పెంపొందించాలని, మంచి సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో ఉపసర్పంచ్‌...