తిమ్మాపూర్, అక్టోబర్ 26 (చైతన్యగళం): తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆదికవి మహర్షి వాల్మీకి జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎలుక అంజనేయులు వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ రామాయణ మహాకావ్యాన్ని రచించి ధర్మం, సత్యం, న్యాయం, మానవతా విలువలను ప్రపంచానికి చాటిచెప్పిన మహర్షి వాల్మీకి జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన ఆశయాలను ఆచరిస్తూ సమాజంలో సమానత్వం, సోదరభావం, సేవాభావాన్ని పెంపొందించాలని, మంచి సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో ఉపసర్పంచ్ ల్యాగల దేవేందర్‌రెడ్డి, తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ అశోక్, కేడీసీసీ బ్యాంకు మేనేజర్ అనిత, నుస్తులాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఆంజనేయులు, వార్డు సభ్యులు, నాయకులు కేమ్మసారం తిరుపతి, పోతుగంటి కొమురయ్య, పడాల సంపత్, నరహరి లక్ష్మి, చెవుల కొమురవ్వ, గ్రామస్థులు పాల్గొన్నారు.