పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదుకు హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు

బీజేపీ మండల అధ్యక్షుడు జరుపుల విజయ్‌ నాయక్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం యాచారం, అక్టోబర్‌ 27 (చైతన్యగళం): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా అర్హులైన పట్టభద్రులకు అవగాహన కల్పించేందుకు రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు జరుపుల విజయ్‌ నాయక్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాల్సిన అవసరాన్ని నాయకులు వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా కోశాధికారి తాండ్ర రవీందర్‌...