CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 27 October 2026, 9:36 pm Posted by : CHAITHANYA GALAM NEWS

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదుకు హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు

  • బీజేపీ మండల అధ్యక్షుడు జరుపుల విజయ్‌ నాయక్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం

యాచారం, అక్టోబర్‌ 27 (చైతన్యగళం): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా అర్హులైన పట్టభద్రులకు అవగాహన కల్పించేందుకు రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు జరుపుల విజయ్‌ నాయక్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాల్సిన అవసరాన్ని నాయకులు వివరించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా కోశాధికారి తాండ్ర రవీందర్‌ మాట్లాడుతూ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలంటే అర్హులైన వారు ముందుగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటు నమోదు ప్రక్రియపై సందేహాలు ఉన్నవారికి సహాయం అందించేందుకే హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆంబోజి జగదీష్‌ యాదవ్‌, భువనగిరి పార్లమెంట్‌ ఎస్సీ మోర్చా ఇన్‌చార్జి నాగని యాదయ్య, రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యుడు గోగికర్‌ రమేష్‌, బీజేపీ సీనియర్‌ నాయకులు గొల్లపల్లి జంగయ్య, పాండురంగారెడ్డి, మొండి గౌరెల్లి సర్పంచ్‌ కొలను రమాదేవి మల్లారెడ్డి, యాచారం మండల ప్రధాన కార్యదర్శులు కొండాపురం నాగరాజు, కుంచారం సందీప్‌రెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శి నడికుడి కృష్ణ, బీజేవైఎం నాయకులు పుప్పాల శాంతికుమార్‌, ఉపాధ్యక్షులు బొడ్డు భాష, పల్లపు నరేష్‌, నాగని కుమార్‌, కార్యదర్శి సాటు మల్లేష్‌, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి సంఘం శ్రీనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.