పట్టభద్రులు ఓటరుగా పేర్లు నమోదు చేసుకోవాలి
నవంబర్ 6 వరకు అవకాశం.. ఆర్డీవో జనార్దన్‌రెడ్డి కల్వకుర్తి, అక్టోబర్ 27 (చైతన్యగళం): డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కల్వకుర్తి ఆర్డీవో జనార్దన్‌రెడ్డి సూచించారు. మంగళవారం కల్వకుర్తి ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పట్టభద్రుల ఓటరు నమోదుకు నవంబర్ 6 వరకు అవకాశం ఉందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఓటరు నమోదు ప్రక్రియను ఆన్‌లైన్‌లోనూ పూర్తి చేసుకునే...