ప్రకృతి వ్యవసాయంతో భావితరాలకు సారవంతమైన నేల

నేలను కాపాడుకోవాలి.. ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యమివ్వాలి: కేవీకే ప్రధాన శాస్త్రవేత్త వెంకటేశ్వర్లు జమ్మికుంట, అక్టోబర్‌ 27 (చైతన్యగళం): ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ప్రధాన శాస్త్రవేత్త వెంకటేశ్వర్లు రైతులకు సూచించారు. ఖేత్‌ బచావో అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్‌ గ్రామ రైతు వేదికలో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. భూమి ఆరోగ్యం మనిషి ఆరోగ్యంతో సమానంగా ముఖ్యమని, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా నేల సారాన్ని కాపాడితే...