పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ సైకిల్‌ ర్యాలీ

విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ పెంపొందించడమే లక్ష్యం: ఏసీపీ సదానందం హుస్నాబాద్‌, అక్టోబర్‌ 27 (చైతన్యగళం): పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా హుస్నాబాద్‌లో సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు ఏసీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ అంబేడ్కర్‌ విగ్రహం వరకు కొనసాగింది. విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొని విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ సదానందం మాట్లాడుతూ, ప్రజల రక్షణ కోసం విధులు నిర్వర్తిస్తూ ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని...