ఈవీఎం గోదాం తరలింపునకు ప్రత్యామ్నాయ వసతుల పరిశీలన

ఎన్నికల సంఘాల అనుమతులతోనే తరలింపు చేపట్టాలి: కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌ నాగర్‌కర్నూల్‌, అక్టోబర్‌ 27 (చైతన్యగళం): నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమీపంలో ప్రస్తుతం ఉన్న ఈవీఎం గోదాం జాతీయ రహదారి 167కే నిర్మాణ పనుల పరిధిలోకి వస్తున్న నేపథ్యంలో, దానిని నెల్లికొండ వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు తరలించేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ భవన వసతులను జిల్లా కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌ పరిశీలించారు. అదనపు కలెక్టర్‌ బి. చెన్నయ్య, నాగర్‌కర్నూల్‌ ఆర్డీఓ అర్చనతో కలిసి మంగళవారం మార్కెట్‌ యార్డును సందర్శించి, గోదాం ఏర్పాటుకు...