తాడూరు కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌

విద్యార్థినుల హాజరు, బోధన, పౌష్టికాహారంపై ఆరా నాగర్‌కర్నూల్‌, అక్టోబర్‌ 27 (చైతన్యగళం): నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని (కేజీబీవీ) జిల్లా కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. దసరా సెలవుల అనంతరం పాఠశాలకు తిరిగి హాజరైన విద్యార్థినుల వివరాలు, విద్యాబోధన, వారికి అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో కలెక్టర్‌ నేరుగా మాట్లాడి వారి వివరాలు తెలుసుకున్నారు. సెలవుల అనంతరం పాఠశాలకు హాజరైన విద్యార్థినుల సంఖ్య, హాజరు శాతంపై ఆరా తీశారు. ఉపాధ్యాయుల...