ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెకు బీఎస్పీ సంఘీభావం
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి.. రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేత నాగర్‌కర్నూల్, అక్టోబర్ 27 (చైతన్యగళం): న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట గత 15 రోజులుగా సమ్మె చేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులకు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) సంఘీభావం తెలిపింది. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పార్టీ తరఫున రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేసింది. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్, నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు...