పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
పార్టీ శ్రేణులకు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పిలుపు ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 27 (చైతన్యగళం): రానున్న మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎన్నికల ఇన్‌చార్జి, మాజీ మండలి చైర్మన్ స్వామి గౌడ్, భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్‌చార్జి క్యామ మల్లేష్ హాజరయ్యారు. సమావేశంలో పట్టభద్రుల...