CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 27 October 2026, 11:49 am Posted by : CHAITHANYA GALAM NEWS

బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా నూతన కార్యవర్గం ప్రకటన

కరీంనగర్‌, అక్టోబర్‌ 26 (చైతన్యగళం): భారతీయ జనతా పార్టీ కరీంనగర్‌ జిల్లా ఎస్టీ మోర్చా నూతన కార్యవర్గాన్ని జిల్లా అధ్యక్షుడు రమావత్‌ శ్రీనివాస్‌ నాయక్‌ సోమవారం ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా బిజిలి సారయ్య, మాలోతు శ్రీనివాస్‌ నాయక్‌, లావుడ్య తిరుపతి నాయక్‌, బిజిలి శ్రీనివాస్‌; ప్రధాన కార్యదర్శులుగా ఇస్లావత్‌ శ్రీనివాస్‌ నాయక్‌, మొగిలి శ్రీనివాస్‌ నియమితులయ్యారు.కార్యదర్శులుగా బానోతు శివ, గుగులోత్‌ శ్రీకాంత్‌, లకావత్‌ శేఖర్‌, కట్ల సంపత్‌; ప్రచార మాధ్యమాల సమన్వయకర్తగా గుగులోత్‌ వంశీ, సామాజిక మాధ్యమాల సమన్వయకర్తగా మాలోత్‌ దీక్షిత్‌, సమాచార సాంకేతిక విభాగం సమన్వయకర్తగా మానుపాటి కుమార్‌, కార్యాలయ కార్యదర్శిగా భూక్య హరి, ‘మన్‌ కీ బాత్‌’ సమన్వయకర్తగా బిజిలి కిషన్‌ నియమితులయ్యారు. కార్యవర్గ సభ్యులుగా లావుడ్య బిక్షపతి, ఇస్లావత్‌ రవి, కెమసారం స్వామి, లావుడ్య సోమన్న, కున్సోత్‌ శ్రీనివాస్‌లకు అవకాశం కల్పించారు.నూతన కార్యవర్గం జిల్లాలో ఎస్టీ మోర్చా, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రమావత్‌ శ్రీనివాస్‌ నాయక్‌ సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, దేశాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.