కళల ద్వారా సామాజిక రుగ్మతలపై అవగాహన కల్పించాలి
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలి: డీఈవో వై. తిరుపతిరావు కరీంనగర్, అక్టోబర్ 27 (చైతన్యగళం): కళల ద్వారా సామాజిక రుగ్మతలపై అవగాహన కల్పించి, వాటిని రూపుమాపేందుకు కృషి చేయవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి వై. తిరుపతిరావు అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ), జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన పాత్రధారణ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో అపారమైన సృజనాత్మకత దాగి ఉంటుందని, ఉపాధ్యాయులు నిరంతరం...