CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 27 October 2026, 12:01 pm Posted by : CHAITHANYA GALAM NEWS

పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన

సిద్దిపేట, అక్టోబర్‌ 26 (చైతన్యగళం): బాలల హక్కులను పరిరక్షించడంతోపాటు, వారిపై జరిగే లైంగిక నేరాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. సౌజన్య సూచించారు. సోమవారం సిద్దిపేటలోని విద్యావర్ధిని ఉన్నత పాఠశాలలో ‘సురక్షిత్‌ బచ్చన్‌ అభియాన్‌’లో భాగంగా న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పోక్సో చట్టం–2012, బాలల హక్కులు, వ్యక్తిగత భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా నమ్మకమైన పెద్దలకు తెలియజేయాలని సౌజన్య సూచించారు. కార్యక్రమంలో న్యాయ సహాయ న్యాయవాది ఎం. రవికుమార్‌, ప్రధానోపాధ్యాయుడు బి. మోహన్‌కుమార్‌, సైబర్‌ క్రైమ్‌ పోలీసు ఎం. హరీష్‌, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.