జాతీయ స్థాయి త్రోబాల్‌ పోటీలకు ఆరుట్ల విద్యార్థిని మౌనిక ఎంపిక

జాతీయ స్థాయిలో రాణించేందుకు మల్‌రెడ్డి స్నేహ–అభిషేక్‌రెడ్డి ఆర్థిక ప్రోత్సాహం ఆరుట్ల(చైతన్యగళం): త్రోబాల్‌ క్రీడలో ప్రతిభ చాటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ (టీపీఎస్‌) ఆరుట్ల విద్యార్థిని బండ మౌనికకు మల్‌రెడ్డి యువశక్తి కన్వీనర్‌ మల్‌రెడ్డి స్నేహ–అభిషేక్‌రెడ్డి ఆర్థిక ప్రోత్సాహం అందించారు. కోల్‌కతాలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు మౌనిక ఎంపికైన విషయం తెలుసుకున్న వారు ఆమెను అభినందించి, పోటీల్లో పాల్గొనేందుకు ఆర్థిక సహాయం అందజేశారు. మంగళవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల చేతుల మీదుగా ఈ సహాయాన్ని మౌనికకు అందించారు. ఆరుట్ల...