CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 27 October 2026, 11:58 am Posted by : CHAITHANYA GALAM NEWS

ప్రజావాణికి 162 దరఖాస్తులు

కరీంనగర్‌, అక్టోబర్‌ 26 (చైతన్యగళం): కరీంనగర్‌ ఐడీఓసీలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్‌ చిత్రా మిశ్రా ప్రజల నుంచి 162 దరఖాస్తులు స్వీకరించారు. నగరపాలక సంస్థకు 42, రెవెన్యూ డివిజనల్‌ అధికారి కార్యాలయానికి 23, గృహనిర్మాణ సంస్థకు 21 అర్జీలు అందాయి. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.మండల స్థాయి ప్రజావాణికి 79 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 306 కోర్టు కేసులను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.