ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోంది
నవంబర్ 5న కరీంనగర్లో భారీ ర్యాలీకి తరలిరావాలి: బోయినపల్లి ప్రవీణ్‌రావు కరీంనగర్ టౌన్, అక్టోబర్ 26 (చైతన్యగళం): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్‌రావు విమర్శించారు. నవంబర్ 5న కరీంనగర్లో నిర్వహించనున్న భారీ ర్యాలీని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్ కొత్తపల్లి మండలంలో నిర్వహించిన పోలింగ్ బూత్ సమావేశంలో, ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించే...