పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల్లో ఓపెన్‌హౌస్‌

విద్యార్థులకు పోలీసుల విధులు, చట్టాలు, సైబర్‌ నేరాలపై అవగాహన శంకరపట్నం, అక్టోబర్ 26 (చైతన్యగళం): పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాలను పురస్కరించుకుని మానకొండూర్ నియోజకవర్గంలోని కేశవపట్నం పోలీస్‌స్టేషన్‌లో సోమవారం విద్యార్థులకు ఓపెన్‌హౌస్‌ కార్యక్రమం నిర్వహించారు. ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీసుల విధులు, పోలీస్‌స్టేషన్ పనితీరు, కేసుల నమోదు, నేరాల దర్యాప్తు, న్యాయస్థానాల ప్రక్రియల గురించి విద్యార్థులకు వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సిన సహాయ నంబర్లపై అవగాహన కల్పించారు. అత్యవసర పోలీస్ సేవలకు 112, బాలల సహాయం కోసం 1098, మహిళల...