- విద్యార్థులకు పోలీసుల విధులు, చట్టాలు, సైబర్ నేరాలపై అవగాహన
శంకరపట్నం, అక్టోబర్ 26 (చైతన్యగళం): పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాలను పురస్కరించుకుని మానకొండూర్ నియోజకవర్గంలోని కేశవపట్నం పోలీస్‌స్టేషన్‌లో సోమవారం విద్యార్థులకు ఓపెన్‌హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీసుల విధులు, పోలీస్‌స్టేషన్ పనితీరు, కేసుల నమోదు, నేరాల దర్యాప్తు, న్యాయస్థానాల ప్రక్రియల గురించి విద్యార్థులకు వివరించారు.
అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సిన సహాయ నంబర్లపై అవగాహన కల్పించారు. అత్యవసర పోలీస్ సేవలకు 112, బాలల సహాయం కోసం 1098, మహిళల సహాయం కోసం 181, సైబర్ మోసాలపై ఫిర్యాదులకు 1930, వైద్య అత్యవసర సేవలకు 108, అగ్నిమాపక సేవలకు 101 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, సామాజిక మాధ్యమాలను అప్రమత్తంగా వినియోగించాలని పోలీసులు సూచించారు. వన్‌టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ), రహస్య సంకేతాలు, బ్యాంకు ఖాతాల వివరాలను ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించారు. బాలల హక్కులు, మహిళల భద్రత, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, అత్యవసర సమయాల్లో సంబంధిత సహాయ నంబర్లను వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై సంపత్‌తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.