జడ గంగయ్య యాదవ్ దశదిన కర్మకు హాజరైన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

వేములపల్లి, అక్టోబర్ 26 (చైతన్యగళం): వేములపల్లి మండల కేంద్రంలో టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్, పీఏసీఎస్‌ చైర్మన్‌ జడ రాములు యాదవ్‌ తండ్రి జడ గంగయ్య యాదవ్‌ దశదిన కర్మ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ గంగయ్య యాదవ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.