ప్రధాని మోదీపై ఖర్గే వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ నిరసన
కరీంనగర్‌లో గీతాభవన్ చౌరస్తా వద్ద ఆందోళన.. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం కరీంనగర్ టౌన్, అక్టోబర్ 26 (చైతన్యగళం): ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసినట్లు పేర్కొంటున్న వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ నాయకులు సోమవారం కరీంనగర్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం ఆధ్వర్యంలో పట్టణంలోని గీతాభవన్ చౌరస్తా వద్ద ఈ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సాయిని మల్లేశం మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని...