- సమీప ప్రత్యర్థిపై 14 ఓట్ల మెజారిటీతో విజయం
కరీంనగర్ టౌన్, అక్టోబర్ 26 (చైతన్యగళం): కరీంనగర్ కన్స్యూమర్ ఫీల్డ్ ఫోర్స్ అసోసియేషన్ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో అక్కు శ్రీనివాస్ అధ్యక్షుడిగా విజయం సాధించారు. మొత్తం 230 ఓట్లు పోలవగా, అక్కు శ్రీనివాస్‌కు 118 ఓట్లు, ఆయన సమీప ప్రత్యర్థి చిదురాల రామ్మోహన్‌కు 104 ఓట్లు, రియాజ్ అహ్మద్‌కు 8 ఓట్లు లభించాయి.
అక్కు శ్రీనివాస్ తన సమీప ప్రత్యర్థి చిదురాల రామ్మోహన్‌పై 14 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎన్నికల్లో తనకు మద్దతుగా ఓటు వేసిన వారందరికీ, అలాగే ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.