CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 26 October 2026, 9:42 pm Posted by : CHAITHANYA GALAM NEWS

మూడు దశాబ్దాల సేవకు అరుదైన గుర్తింపు

  • లయన్స్‌ క్లబ్‌లో సభ్యత్వం పొందిన ప్రముఖ వైద్యుడు డా. మునీర్ అహ్మద్ షరీఫ్

మిర్యాలగూడ, అక్టోబర్ 26 (చైతన్యగళం): గత 30 ఏళ్లుగా పేద ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో ప్రాథమిక వైద్య సేవలు అందిస్తూ, తన సేవా కార్యక్రమాలతో ‘అందరివాడు’గా గుర్తింపు పొందిన ప్రముఖ వైద్యుడు డా. మునీర్ అహ్మద్ షరీఫ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న లయన్స్‌ క్లబ్‌లో ఆయనకు సభ్యత్వం లభించింది. మిర్యాలగూడ లయన్స్‌ క్లబ్‌ డిస్ట్రిక్ట్‌ చైర్‌పర్సన్‌ కోలా సైదులు ముదిరాజ్‌.. డా. మునీర్ అహ్మద్ షరీఫ్ అందిస్తున్న సేవలను గుర్తించి ఆయనకు సభ్యత్వం కల్పించి అభినందించారు.

ఈ సందర్భంగా డా. మునీర్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ.. తన తల్లిదండ్రుల స్ఫూర్తితో గత మూడు దశాబ్దాలుగా తన పరిధి మేరకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల అభిమానం, ఆశీస్సులు పొందడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. లయన్స్‌ క్లబ్‌ తనపై నమ్మకంతో అందించిన ఈ గుర్తింపు ఎంతో గొప్పదని పేర్కొన్నారు. సమాజం మనకేం ఇచ్చిందనే దానికంటే సమాజానికి మనం ఏమి చేయగలమనే సంకల్పంతో జనయేత్రి ఫౌండేషన్‌ను స్థాపించి రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. లయన్స్‌ క్లబ్‌ సభ్యుడిగా తన బాధ్యత మరింత పెరిగిందని పేర్కొన్నారు. ఈ అవకాశం కల్పించిన మిర్యాలగూడ లయన్స్‌ క్లబ్‌ సభ్యులందరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.