నగరాభివృద్ధికి పెద్దపీట వేస్తాం

66 డివిజన్లలో దశలవారీగా అభివృద్ధి పనులు.. మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ సరస్వతినగర్‌లో రూ.40.70 లక్షలతో డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు శ్రీకారం కరీంనగర్‌, అక్టోబర్‌ 25 (చైతన్యగళం): కరీంనగర్‌ నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తూ దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని నగర మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ తెలిపారు. నగరంలోని రెండో, ఎనిమిదో డివిజన్లలో ఆదివారం ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రెండో డివిజన్‌ సరస్వతినగర్‌లో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధుల నుంచి రూ.40.70 లక్షలతో చేపట్టనున్న ఆర్‌సీసీ...