విజయవంతంగా ముగిసిన లయన్స్ క్వెస్ట్ ఉపాధ్యాయుల శిక్షణ
విద్యార్థుల సమగ్ర వికాసానికి జీవన నైపుణ్యాల బోధన కీలకం కరీంనగర్, అక్టోబర్ 25 (చైతన్యగళం): లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో, లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా 320జీ పరిధిలో కరీంనగర్ మంకమ్మతోటలోని పరమిత హైస్కూల్‌లో అక్టోబర్ 24, 25 తేదీల్లో నిర్వహించిన రెండు రోజుల లయన్స్ క్వెస్ట్ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. విద్యార్థుల్లో సామాజిక, భావోద్వేగ వికాసాన్ని పెంపొందించడంతోపాటు ఆత్మవిశ్వాసం, స్వీయ నియంత్రణ, సత్సంబంధాలు, బాధ్యతాయుత నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, సానుకూల ప్రవర్తనను అభివృద్ధి చేసే బోధనా పద్ధతులపై ఉపాధ్యాయులకు...