ఎన్‌హెచ్‌-563పై ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు

గోల్డెన్‌ అవర్‌లో క్షతగాత్రులకు వైద్యసాయం అందించాలి సీసీ కెమెరాల నిఘా, హైవే పెట్రోలింగ్‌ నిరంతరం కొనసాగాలి: సీపీ గౌస్‌ ఆలం మానకొండూర్‌, అక్టోబర్‌ 24 (చైతన్యగళం): వరంగల్‌–కరీంనగర్‌ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-563)పై రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం అధికారులను ఆదేశించారు. నూతనంగా నిర్మించిన జాతీయ రహదారిపై ప్రయాణికుల భద్రత కోసం చేపట్టిన ఏర్పాట్లను శనివారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మానకొండూర్‌ నియోజకవర్గం శంకరపట్నం మండలం కొత్తగట్టు వద్ద ఉన్న హైవే పెట్రోలింగ్‌ యూనిట్‌, టోల్‌ప్లాజా...