రిటైర్డ్‌ ప్రధానోపాధ్యాయుడు గీట్ల దామోదర్‌ కుటుంబానికి ఎమ్మెల్యే రాజ్‌ ఠాకూర్‌ పరామర్శ

గోదావరిఖని, అక్టోబర్‌ 25 (చైతన్యగళం): సింగరేణి పాఠశాల రిటైర్డ్‌ ప్రధానోపాధ్యాయుడు గీట్ల దామోదర్‌ మృతి పట్ల రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్‌. రాజ్‌ ఠాకూర్‌ సంతాపం వ్యక్తం చేశారు. గోదావరిఖనిలోని దుర్గానగర్‌లో ఉన్న దామోదర్‌ నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా దామోదర్‌ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని ఆకాంక్షిస్తూ వారికి ధైర్యం చెప్పారు.