డాక్టర్ ఎస్.ఎన్ సుబ్బారావు భాయీజీకి మేయర్ కొలగాని శ్రీనివాస్ ఘన నివాళి
భాయీజీ ఆశయాలు యువతకు మార్గదర్శకం.. దేశసేవ, మానవతా విలువలు ఆయన జీవిత సందేశం కరీంనగర్, అక్టోబర్ 25 (చైతన్యగళం): ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, ‘చంబల్ గాంధీ’గా పేరుగాంచిన డాక్టర్ ఎస్.ఎన్. సుబ్బారావు భాయీజీ ఐదో వర్ధంతి సందర్భంగా కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ఘనంగా నివాళులర్పించారు. నగరపాలక సంస్థ పరిధిలోని తీగలగుట్టపల్లిలో ఉన్న మేయర్ శిబిర కార్యాలయంలో ఆదివారం భాయీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అక్టోబర్ 25 నుంచి 27 వరకు మూడు రోజులపాటు నిర్వహించనున్న వర్ధంతి కార్యక్రమాలను...