సీపీఎంను గెలిపించండి.. వార్డు అభివృద్ధికి పోరాడుతాం
బైరెడ్డినగర్ 8వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి దూదేకుల గోకారి సాహెబ్ ప్రచారం నందికొట్కూరు (చైతన్యగళం): నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని బైరెడ్డినగర్ 8వ వార్డులో సీపీఎం కౌన్సిలర్ అభ్యర్థి దూదేకుల గోకారి సాహెబ్ గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీపీఎం అభ్యర్థిని గెలిపిస్తే వార్డు అభివృద్ధి కోసం నిరంతరం పోరాడుతామని నాయకులు తెలిపారు. వార్డులో మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారం, పేదల సంక్షేమానికి ప్రాధాన్యం...