CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 25 October 2026, 9:18 pm Posted by : CHAITHANYA GALAM NEWS

సీపీఎంను గెలిపించండి.. వార్డు అభివృద్ధికి పోరాడుతాం

  • బైరెడ్డినగర్‌ 8వ వార్డులో కౌన్సిలర్‌ అభ్యర్థి దూదేకుల గోకారి సాహెబ్‌ ప్రచారం

నందికొట్కూరు (చైతన్యగళం): నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని బైరెడ్డినగర్‌ 8వ వార్డులో సీపీఎం కౌన్సిలర్‌ అభ్యర్థి దూదేకుల గోకారి సాహెబ్‌ గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీపీఎం అభ్యర్థిని గెలిపిస్తే వార్డు అభివృద్ధి కోసం నిరంతరం పోరాడుతామని నాయకులు తెలిపారు.

వార్డులో మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారం, పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. ప్రజల ఆదరణతో గోకారి సాహెబ్‌ను కౌన్సిలర్‌గా గెలిపిస్తే వార్డు సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని నాయకులు అన్నారు.

ఈ ప్రచార కార్యక్రమంలో అభ్యర్థి దూదేకుల గోకారి సాహెబ్‌తో పాటు సీపీఎం నాయకులు ఎస్. ఉస్మాన్ భాష, ఓబులేసు, హరివర్ధన్, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకుడు పి. మరి స్వామి, సీపీఎం నాయకులు మద్దమ్మ, శాంతమ్మ, మా భాష, బీరమ్మ, ఒలి భాష తదితరులు పాల్గొన్నారు.