వైఎస్సార్‌సీపీ నాయకుల మృతికి కాటసాని రామభూపాల్‌రెడ్డి సంతాపం
పాణ్యం (చైతన్యగళం): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు గుండెపోటుతో మృతి చెందడంతో పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఓర్వకల్లు మండలం కేతవరం గ్రామానికి చెందిన పార్టీ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకున్న ఆయన గ్రామానికి చేరుకుని పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ విషాద సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం పాణ్యం...