CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 25 October 2026, 9:14 pm Posted by : CHAITHANYA GALAM NEWS

వైఎస్సార్‌సీపీ నాయకుల మృతికి కాటసాని రామభూపాల్‌రెడ్డి సంతాపం

పాణ్యం (చైతన్యగళం): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు గుండెపోటుతో మృతి చెందడంతో పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఓర్వకల్లు మండలం కేతవరం గ్రామానికి చెందిన పార్టీ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకున్న ఆయన గ్రామానికి చేరుకుని పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ విషాద సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

అనంతరం పాణ్యం మండలం గోరుకల్లు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు జింకల వెంకట నాగిరెడ్డి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలుసుకుని కాటసాని రామభూపాల్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఆయన పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి మనోధైర్యం కల్పించారు.

ఈ సందర్భంగా కాటసాని రామభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ, పార్టీకి చెందిన ఇద్దరు నాయకుల మృతి తీరని లోటని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమాల్లో ఓర్వకల్లు, పాణ్యం మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.