నన్నూరులో టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరికలు

కాటసాని రామభూపాల్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన తెలుగు అంజి, మిత్రబృందం పాణ్యం (చైతన్యగళం): నంద్యాల జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన తెలుగు అంజి, ఆయన మిత్రబృందం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నన్నూరు గ్రామ వైఎస్సార్‌సీపీ నాయకుడు చెన్నారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాటసాని శివ నరసింహారెడ్డి సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా కాటసాని రామభూపాల్‌రెడ్డి తెలుగు అంజి,...