అహంకారానికి ప్రజలే బుద్ధి చెబుతారు

అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం: ఎమ్మెల్యే మేఘారెడ్డి వనపర్తి, అక్టోబర్‌ 25 (చైతన్యగళం): మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అహంకారపూరిత వ్యాఖ్యలు మానుకోవాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సూచించారు. ప్రజలు ఓటుతో తీర్పు ఇచ్చినా ఆయన తీరు మారలేదని, వనపర్తి ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని అన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014 నుంచి 2023 వరకు బీఆర్‌ఎస్‌ పాలనలో వనపర్తి అభివృద్ధి పేరుతో విధ్వంసానికి గురైందని మేఘారెడ్డి ఆరోపించారు. బీసీ...