తంగెడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం
తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వైద్య సేవలు.. డాక్టర్ తంగెడ ప్రేమానందరావు ఎల్కతుర్తి గ్రామీణం, అక్టోబర్ 25 (చైతన్యగళం): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామంలో తంగెడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఫౌండేషన్‌కు చెందిన డాక్టర్ తంగెడ ప్రేమానందరావు తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉదయం 10 గంటలకు ప్రారంభమైన శిబిరం సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగింది. హైదరాబాద్‌కు చెందిన వివిధ విభాగాల ఆయుర్వేద వైద్యులు...