పాత బానకచర్లలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి ఇంటింటి ప్రచారం
పాములపాడు, అక్టోబర్ 25 (చైతన్యగళం): పాములపాడు మండలం పాత బానకచర్ల గ్రామంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ఇళ్లకు వెళ్లి ప్రజలను కలుసుకుంటూ పార్టీ తరఫున మద్దతు కోరారు. స్థానికులతో మమేకమవుతూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ఈ ప్రచార కార్యక్రమంలో గడ్డం మధుబాబు, ఓబుల రెడ్డి, ఓబన్న గౌడ్, స్వామి దాసు, సుధాకర్ రెడ్డి, బండి రాజు, బండి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.