అయోధ్య పద్మశాలి అన్నసత్రం ధర్మకర్తగా స్వర్గం మల్లేశం

తెలంగాణ నుంచి అయోధ్యకు వెళ్లే భక్తులకు వసతి, భోజన సౌకర్యాలు కరీంనగర్‌, అక్టోబర్‌ 25 (చైతన్యగళం): కరీంనగర్‌ జిల్లా పద్మశాలి సంక్షేమ ట్రస్ట్‌ అధ్యక్షుడు స్వర్గం మల్లేశం అయోధ్య పద్మశాలి అన్నసత్రం ధర్మకర్తగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి సమావేశంలో ఆయనను ధర్మకర్తగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా స్వర్గం మల్లేశం మాట్లాడుతూ తెలంగాణ నుంచి అయోధ్యకు వెళ్లే భక్తులకు పద్మశాలి అన్నసత్రం ద్వారా వసతి, భోజన సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. పద్మశాలి కులస్థులతో పాటు అన్ని వర్గాల భక్తులు ఈ సౌకర్యాలను...