- తెలంగాణ నుంచి అయోధ్యకు వెళ్లే భక్తులకు వసతి, భోజన సౌకర్యాలు
కరీంనగర్, అక్టోబర్ 25 (చైతన్యగళం): కరీంనగర్ జిల్లా పద్మశాలి సంక్షేమ ట్రస్ట్ అధ్యక్షుడు స్వర్గం మల్లేశం అయోధ్య పద్మశాలి అన్నసత్రం ధర్మకర్తగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి సమావేశంలో ఆయనను ధర్మకర్తగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా స్వర్గం మల్లేశం మాట్లాడుతూ తెలంగాణ నుంచి అయోధ్యకు వెళ్లే భక్తులకు పద్మశాలి అన్నసత్రం ద్వారా వసతి, భోజన సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. పద్మశాలి కులస్థులతో పాటు అన్ని వర్గాల భక్తులు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అయితే, మొదటి ప్రాధాన్యం పద్మశాలి కుల బంధువులకు కల్పిస్తామని పేర్కొన్నారు.
స్వర్గం మల్లేశం ధర్మకర్తగా ఎన్నిక కావడంపై పద్మశాలి సంఘం రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ వాసాల రమేష్, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు మెతుకు సత్యం, పోపా అధ్యక్షుడు పోలు సత్యనారాయణ, కార్యదర్శి ఎలిగేటి మల్లికార్జున్, పోపా మాజీ అధ్యక్షుడు చేరాల మల్లికార్జున్ దేవ్, పట్టణ అధ్యక్షుడు గడ్డం శ్రీరాములు హర్షం వ్యక్తం చేశారు.
అలాగే జిల్లా నాయకులు అల్స భద్రయ్య, దూడం శ్రీనివాస్, వొల్లాల కృష్ణహరి, మార్త ప్రకాష్, వోడ్నాల రవీందర్, స్వర్గం నర్సయ్య, వేముల చంద్రశేఖర్, వేముల విష్ణుమూర్తి, జక్కని ప్రభాకర్, భూదారపు శ్రీనివాస్ తదితరులు ఆయనకు అభినందనలు తెలిపారు.