రెడ్‌క్రాస్ జిల్లా కార్యవర్గ సభ్యులకు ఘన సన్మానం
కోల అన్నారెడ్డి, సాయినేని నరేందర్‌ను సత్కరించిన డా. కొండా దేవయ్య కరీంనగర్, అక్టోబర్ 25 (చైతన్యగళం): ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కరీంనగర్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికై, నియామకమైన సామాజికవేత్త, ప్రముఖ ఇంజినీర్ కోల అన్నారెడ్డి, సాయినేని నరేందర్‌లను తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం కన్వీనర్ డా. కొండా దేవయ్య ఘనంగా సన్మానించారు. శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో వారికి శాలువాలు కప్పి, దక్షిణ కాశీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ప్రతిమలను జ్ఞాపికలుగా అందజేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి మున్నూరు కాపు సత్రం...