CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 25 October 2026, 8:32 pm Posted by : CHAITHANYA GALAM NEWS

రెడ్‌క్రాస్‌ జిల్లా కార్యవర్గ సభ్యులకు ఘన సన్మానం

  • కోల అన్నారెడ్డి, సాయినేని నరేందర్‌ను సత్కరించిన డా. కొండా దేవయ్య

కరీంనగర్‌, అక్టోబర్‌ 25 (చైతన్యగళం): ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ కరీంనగర్‌ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికై, నియామకమైన సామాజికవేత్త, ప్రముఖ ఇంజినీర్‌ కోల అన్నారెడ్డి, సాయినేని నరేందర్‌లను తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం కన్వీనర్‌ డా. కొండా దేవయ్య ఘనంగా సన్మానించారు. శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో వారికి శాలువాలు కప్పి, దక్షిణ కాశీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ప్రతిమలను జ్ఞాపికలుగా అందజేశారు.

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి మున్నూరు కాపు సత్రం వ్యవస్థాపకుడు, పటేల్‌ సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర బీసీ సంఘం కన్వీనర్‌ డా. కొండా దేవయ్య ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కోల అన్నారెడ్డి వేములవాడలోని నిత్యాన్నదాన మున్నూరు కాపు సత్రం ఉపాధ్యక్షుడిగా కూడా సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తరించి ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో శ్రీనివాస్‌, కర్నె రాజమౌళి పాల్గొన్నారు. సత్రం ఆర్గనైజింగ్‌ కార్యదర్శి చిలుక రమేష్‌ సన్మానితులకు శుభాకాంక్షలు తెలిపారు.