వైసీపీని వీడి టీడీపీలోకి 30 మంది యువకులు
నందికొట్కూరు (చైతన్యగళం): నందికొట్కూరు పట్టణంలోని ఏబీఎం పాలెంకు చెందిన సుమారు 30 మంది యువకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అల్లూరు గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకుడు మాండ్ర శివానందరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య సమక్షంలో కాటేపోగు మహేష్, కాటేపోగు ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా మాండ్ర శివానందరెడ్డి యువకులకు పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి యువత కృషి చేయాలని, ప్రజాసేవకు ప్రాధాన్యమిస్తూ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు...